ములుగు జిల్లాలో ఘనంగా ఒలింపిక్ డే రన్–2026 నిర్వహణ
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒలింపిక్ డే రన్–2026 కార్యక్రమం బుధవారం ములుగు జిల్లా ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో ములుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖలు, రూరల్ వాటర్ సప్లై శాఖల మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క) హాజరయ్యారు. అలాగే జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే (ఐఏఎస్), జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ (ఐపీఎస్) పాల్గొన్నారు.
జిల్లా ఒలింపిక్ డే రన్ కమిటీ కన్వీనర్‌గా పగడాల వెంకటేశ్వర్ రెడ్డి వ్యవహరించారు.
క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రజల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, విద్యార్థులు, యువతతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి