అభిమాని కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. హన్మకొండలోని అభిమాని ఇంటిలో పరామర్శ...

 హనుమకొండకు చెందిన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కోరికను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి కలవాలని బాలుడు కోరుకున్నట్లు తెలిసింది.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హనుమకొండకు చేరుకుని బాలుడిని కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బాలుడికి ధైర్యం చెప్పారు. ఈ ఘటన స్థానికంగా భావోద్వేగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

మానవత్వంతో స్పందించి బాలుడి కోరిక తీర్చడంపై అభిమానులు, స్థానికులు స్పందిస్తున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఇతర కార్యక్రమాల్లో

కూడా పాల్గొన్నట్లు సమాచారం.

WhatsApp Share

కామెంట్‌లు