పోస్ట్‌లు

జులై, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అశ్రునయనాలతో తుదివీడ్కోలు...అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి సీతక్క.

చిత్రం
నల్లబెల్లి, జూలై 31: ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి శుక్రవారం స్వగ్రామం నల్లబెల్లిలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు చేపట్టిన అంతిమయాత్రలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఈ నెల 26న గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అంతిమయాత్రలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన అకాల మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా ఆయన సేవలు చి...

ఉద్యమ నాయకుడికి అశ్రునయనాలతో తుదివీడ్కోలు..

చిత్రం
నర్సంపేట : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి శుక్రవారం ఆయన స్వగ్రామం నల్లబెల్లిలో కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. గుండెపోటుకు గురై పలురోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడవడంతో ఆయన మృతిపై రాజకీయ, సామాజిక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన భౌతికకాయానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను ఈ సందర్భంగా పలువురు నాయకులు స్మరించుకున్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజల మధ్య పనిచేసిన నాయకుడిగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసిన ప్రజాప్రతినిధిగా ఆయన సేవలను కొనియాడారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మరణం నర్సంపేట నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యమ బాటలో మొదలైన ప్రస్థానం.. ప్రజానాయకుడిగా నిలిచిన పెద్...

అత్తిలిలో లేస్, నేత కళాకారులకు ఉచిత కంటి వైద్య శిబిరం...

చిత్రం
అత్తిలి: హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాల నిర్వహణను కొనసాగిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో లేస్, నేత కళాకారుల కోసం గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మొత్తం 143 మంది కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. వీరికి త్వరలోనే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరో 110 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించి వాటిని ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా 18 మంది కళాకారులకు అవసరమైన మందులను కూడా పంపిణీ చేశారు. హస్తకళాకారుల ఆరోగ్యమే వారి జీవనోపాధికి, కళల పరిరక్షణకు కీలకమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కొండపల్లి, నరసాపురం, పాలకొల్లు, బొబ్బిలి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించినట్లు వెల్లడించారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన మందులు, కళ్లద్దాలు, శస్త్రచికిత్సలను ఉచితంగా అందిస్తూ హస్తకళాకారులక...

స్కిల్స్ ఆధారిత విద్యతో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

చిత్రం
హైదరాబాద్, జూలై 30: మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య పూర్తిచేసే విద్యార్థులు కేవలం పరీక్షల్లో మార్కులు సాధించే స్థాయిలో కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే నైపుణ్యాలు కలిగి ఉండేలా విద్యాబోధన సాగాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ దాశరథి ఆడిటోరియంలో నిర్వహించిన "టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్" కార్యక్రమంలో ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ఉపాధ్యాయ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన తన కార్యాచరణను వివరించారు. విద్యార్థుల్లో ప్రపంచ స్థాయి అవగాహన, నైపుణ్యాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న సీఎం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. విద్యా నాణ్యత పెంపు కోసం వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన మార్పులపై డిసెంబరు నాటికి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి ...

నర్సంపేటలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ముఖ్య కార్యకర్తల సమావేశం..

చిత్రం
నర్సంపేట, జూలై 30: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు, అవినీతి అక్రమార్కులకు అండగా నిలుస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాయం చిన్న చంద్రన్న ఆరోపించారు. నర్సంపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి పార్టీ జిల్లా నాయకుడు బి. నరసింహారావు అధ్యక్షత వహించారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్న పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. దీంతో పేదరికం, నిరుద్యోగం, వలసలు, ఆకలి సమస్యలు పెరిగాయని పేర్కొన్నారు. మంచి రోజులు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అధాని, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ సామాన్య ప్రజలను మరింత పేదరికంలోకినెడుతుందని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాస్ లైన్‌లో చేర...

బంగారు బ్రేస్‌లెట్‌ పోగొట్టుకున్న వ్యక్తి...

హనుమకొండ, జూలై 27 కాజీపేట పోలీసులు మరోసారి తమ అప్రమత్తతను చాటుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోగొట్టుకున్న బంగారు బ్రేస్‌లెట్‌ను గుర్తించి, దాని యజమానికి సురక్షితంగా అప్పగించారు. డీజిల్ కాలనీకి చెందిన నరేష్ నగరంలోని ఓ షోరూమ్‌లో కొనుగోళ్లు చేస్తున్న క్రమంలో అనుకోకుండా తన బంగారు బ్రేస్‌లెట్‌ను పోగొట్టుకున్నాడు. అనంతరం ఆయన కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ శ్యామ్ సుందర్ వెంటనే స్పందించి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. సీఐ ఆదేశాల మేరకు క్రైమ్ పోలీసు సిబ్బంది వి. క్రాంతి కుమార్, కుమార్ షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి, పోయిన బ్రేస్‌లెట్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని నరేష్‌కు అప్పగించారు. తమ విలువైన బంగారు ఆభరణాన్ని తిరిగి అందించిన కాజీపేట పోలీసుల వేగవంతమైన చర్యలను నరేష్, ఆయన కుటుంబ సభ్యులు అభినందించారు. సీఐ శ్యామ్ సుందర్‌తో పాటు కేసు విచారణలో పాల్గొన్న పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆస్తుల రక్షణ, ఫిర్యాదుల పరిష్కారంలో కాజీపేట పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఈ ఘటన మరోసారి నిరూపిం...

ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం ఏ. రేవంత్ రెడ్డి

చిత్రం
న్యూఢిల్లీ, జూలై 28: ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో పెద్దగా సమస్యలు తలెత్తలేదని, ఆఫ్‌లైన్ పరీక్షల సమయంలోనే లీకేజీలు వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఢిల్లీలో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, దేశవ్యాప్తంగా అనుమతి లేకుండా కోచింగ్ కేంద్రాలు విస్తరిస్తున్నాయని, వాటిలో కొన్ని ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్రాలుగా మారుతున్నాయని విమర్శించారు. ఈ సమస్యను అరికట్టేందుకు జాతీయ స్థాయిలో సమగ్ర విధానం రూపొందించాలని సూచించారు. యూనివర్సిటీలపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని, విద్యను వీలైనంత వరకు రాష్ట్రాల పరిధిలో ఉంచితే పారదర్శకత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ను యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేసి పారదర్శకంగా నియామక పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు ...

అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగల స్వాధీనం..

చిత్రం
ములుగు, జూలై 27 : అక్రమంగా టేకు కలప రవాణాపై ములుగు పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక వాహన తనిఖీల్లో రూ.4.15 లక్షల విలువైన టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ములుగు జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆపి పరిశీలించారు. ట్రాక్టర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 10 టేకు దుంగలను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.4.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వాహనం, టేకు దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. జిల్లాలో అక్రమ కలప రవాణా, అటవీ సంపద అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు డీఎస్పీ హెచ్చరించారు.

తొలి ఏకాదశి సందర్భంగా హనుమాన్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు...

చిత్రం
హనుమకొండ : హనుమాన్ నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేసి, పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేదమంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులతో గుడి ప్రాంగణం కిటకిటలాడింది. హనుమాన్ నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారు . తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆలయ అర్చకులు దీవించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథులన్నింటికీ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశిగా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యంగా...

ట్రాఫిక్, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

చిత్రం
హైదరాబాద్ , జూలై 24: రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు రోడ్డు భద్రత పర్యవేక్షణను బలోపేతం చేయడానికి ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై సమగ్ర అధ్యయనం చేసి ఏర్పాటు చేసే బ్యూరోకు స్పష్టమైన సంస్థాగత నిర్మాణం ఉండాలని సీఎం పేర్కొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ వ్యవస్థలో కేవలం నిబంధనల అమలుకే పరిమితం కాకుండా క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి సారించాలని సీఎం అన్నారు. వాతావరణ పరిస్థితులు, కార్యాలయాల పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణానికి ముందే ట్రాఫిక్ అధ్యయనం తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్న సీఎం, ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల ...

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. కన్నాయిగూడెంలో భారీ ర్యాలీ

ములుగు (కన్నాయిగూడెం), జూలై 24: ఢిల్లీలో యువత, విద్యార్థులపై లాఠీచార్జ్‌తో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదిక నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాంబాబు, జిల్లా సీనియర్ నాయకుడు ఎండీ అప్సర్ పాషా మాట్లాడుతూ, తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువత, విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. యువత, విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందిపోయి, అణచివేత చర్యలకు పాల్పడటం స...

బ్యాటరీల చోరీ కేసును ఛేదించిన నర్సంపేట పోలీసులు.. ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ...

చిత్రం
నర్సంపేట : ఇటీవల పాకాల రోడ్డులోని ఓ బండల షాపులో ఉన్న రెండు గూడ్స్ ట్రాలీల బ్యాటరీలు చోరీకి గురైన ఘటనను నర్సంపేట స్టేషన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన బ్యాటరీలతో పాటు ఘటనలో ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఆటోలో ముగ్గురు వ్యక్తులు వస్తుండగా, పోలీసులను గమనించిన వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా, ఆటోలో ఉన్న రెండు బ్యాటరీలను ఇటీవల పాకాల రోడ్డులోని బండల షాపు నుంచి దొంగిలించినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఎస్‌కే నాయాబ్ రసూల్ (ఎన్‌జీవోస్ కాలనీ), ముద్ధంగుల మహేష్ (వడ్డెర కాలనీ)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుల నుంచి చోరీకి గురైన రెండు గూడ్స్ ట్రాలీ బ్యాటరీలతో పాటు ఘటనలో ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు,...

మల్లన్న భక్తులకు శుభవార్త.. కొమురవెల్లికి ప్రత్యేక రైళ్లు.. టికెట్ ధర రూ.20 మాత్రమే

చిత్రం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 26 నుంచి సికింద్రాబాద్–కొమురవెల్లి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. రైల్వే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 77656, 77654, 77655 నంబర్ల ప్రత్యేక రైళ్లు ప్రతి బుధవారం మినహా , 77653 నంబర్ ప్రత్యేక రైలు ప్రతి గురువారం మినహా సేవలు అందించనుంది. రైళ్ల వివరాలు: రైలు నం. 77656: సికింద్రాబాద్ నుంచి ఉదయం 6:45 గంటలకు బయలుదేరి 7:04 గంటలకు కొమురవెల్లి చేరుతుంది. (ప్రతి బుధవారం మినహా) రైలు నం. 77654: సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి 2:38 గంటలకు కొమురవెల్లి చేరుతుంది. (ప్రతి బుధవారం మినహా) రైలు నం. 77653: కొమురవెల్లి నుంచి ఉదయం 10:35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:52 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. (ప్రతి గురువారం మినహా) రైలు నం. 77655: కొమురవెల్లి నుంచి సాయంత్రం 5:50 గంటలకు బయలుదేరి రాత్రి 8:04 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. (ప్రతి బుధవారం మినహా) ప్రత్యేక రైళ్లలో సికింద్రాబాద్–కొమురవెల్లి మధ్య ఒకవైపు ప్రయాణ టికెట్ ధర...

CEIR పోర్టల్‌తో పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అప్పగించిన హసన్‌పర్తి పోలీసులు..

చిత్రం
హనుమకొండ , జూలై 23: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు తిరిగి అందజేయడంలో హసన్‌పర్తి పోలీసులు మరోసారి విజయవంతమయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో, స్టేషన్ సిబ్బంది కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ను వినియోగించి పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి గురువారం బాధితులకు అందజేశారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధితులు మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సంబంధిత వివరాలను CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం ఫోన్ల IMEI నంబర్ల ఆధారంగా సాంకేతిక నిఘా చేపట్టి, వాటి ఆచూకీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ బాధితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి వివరాలను ధృవీకరించిన అనంతరం అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయిస్తే ఫోన్‌ను గుర్తించే అవకాశాలు మెరుగుపడతాయని పోలీసులు సూచిం...

విద్యార్థుల యూనిఫాంలపై వాట్సాప్ ద్వారా ఫీడ్‌బ్యాక్.. నాణ్యత ఆధారంగా వచ్చే ఏడాది మార్పులు: సీఎం

చిత్రం
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫాంల నాణ్యత, సైజు, రంగు తదితర అంశాలపై విద్యార్థుల నుంచి నేరుగా వాట్సాప్ ద్వారా అభిప్రాయాలు (ఫీడ్‌బ్యాక్) సేకరిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాంల పంపిణీ విధానం, రంగులు, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం యూనిఫాంల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు అందించే యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. మహిళా సంఘాల ద్వారా కుట్టు పనులు వేగవంతం అయ్యేలా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్యకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో యూనిఫాంల పంపిణీలో లోపాలు చోటుచేసుకున్నాయని పేర్కొ...

NEET పేపర్ లీక్‌పై కేంద్రం కొరడా.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులతో నిందితులకు వేగంగా శిక్షలు: ప్రధాని మోడీ

చిత్రం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేసిన ఆయన, పేపర్ లీక్‌లకు పాల్పడిన నిందితులపై వేగవంతమైన విచారణ చేపట్టి కఠిన శిక్షలు అమలు చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గురువారం సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన ప్రధాని, యువత భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల కష్టాన్ని, వారి కలలను నాశనం చేసే వారిపై చట్టం తన పని తప్పకుండా చేస్తుందని అన్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కీలక నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలు వరుసగా వెలుగులోకి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ...

మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: అధికారులకు సీఎం ఆదేశాలు..

చిత్రం
హైదరాబాద్ , జూలై 23: హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ పూర్తికాకముందే టెండర్లు పిలవకూడదని సీఎం స్పష్టం చేశారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. అలాగే మూడు మున్సిపల్ కమిషనరేట్ల పరిధిలో చేపట్టే పనులకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం, జంక్షన్ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులకు సూచించారు. సమావేశంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) భవనం, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన నమూనాలను పరిశీలించ...

తెలంగాణలో జనసేన పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలు.. స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాచరణకు శ్రీకారం..

చిత్రం
తెలంగాణలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ తదితర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ పర్యటనల సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణ, కార్యకర్తలతో క్షేత్రస్థాయి ప్రత్యక్ష సమావేశాలు, స్థానిక ప్రజా సమస్యలపై సమీక్ష, ఎన్నికల సన్నాహక వ్యూహాలపై చర్చలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తొలి విడత సమావేశం నిర్వహించారు. అనంతరం మిగిలిన 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేసిన తర్వాత, జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రత్యేక పర్యటనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు X వేదికగా వెల్లడించాయి. మూలం: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం.

ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం

చిత్రం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆహార పదార్థాలు, ఔషధాల్లో పెరుగుతున్న కల్తీలను అరికట్టేందుకు **తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)**ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. మార్కెట్‌లో లభిస్తున్న నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాల్లో కల్తీ పెరగడంతో ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలను వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం కారణంగా పంటల్లో రసాయన అవశేషాలు మిగులుతున్నాయని, దీంతో కొన్ని దేశాలు భారత వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను నిరాకరిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. సేంద్రియ ఉత్పత్తుల పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్న వస్తువుల నాణ్యతను నిర్ధారించే సమర్థమైన వ్యవస్థలు ప్రస్తుతం లేవని, ప్రజలు అధిక ధరలు చెల్లిస్తున్నప్పటికీ వాటి ప...

రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య..

చిత్రం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామానికి చెందిన ఈక చిన్న అప్పయ్య, అర్రెం బిక్షపతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో వారి నివాసాలకు వెళ్లిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య, మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు అండగా ఉంటుందని, ఎలాంటి ధైర్యం కోల్పోవద్దని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అదే విధంగా గాంధీనగర్ గ్రామానికి చెందిన గూగులోత్ రాజమ్మ గుండెపోటుతో మృతిచెందగా, ఆమె పార్థివదేహానికి కూడా కుంజా సూర్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడుగుల వెంకటకృష్ణ, INTUC జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రసాపూత్ సీతారామ్, గోవిందరావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింత క్రాంతి, ములుగు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మర్రి నరేష్, యూత్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు నాంపల్లి సుమన్, యూత్ నాయకులు తిరు...

ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

చిత్రం
హైదరాబాద్ : "జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు. అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం తెలిపారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అంకితభావం, ప్రజల పట్ల నిబద్ధత, సమాజానికి అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ పేరు, ఆయన సాహిత్యం, ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూలం: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO Telangana)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్..

చిత్రం
హైదరాబాద్ : కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని డిశ్చార్జ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గవర్నర్, వైద్యుల సూచనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ప పవన్ కళ్యాణ్ నివాసంలోని వ్యక్తిగత లైబ్రరీని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సందర్శించి, అక్కడ ఉన్న పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రముఖ రచయితలు, మేధావులు, విశ్లేషకులు, ప్రజా విధాన రూపకర్తలు రచించిన గ్రంథాలపై పవన్ కళ్యాణ్‌తో ఆసక్తికరంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు ఒక పుస్తకంపై గవర్నర్ ఆటోగ్రాఫ్ చేశారు. తన ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఆప్యాయంగా విచ్చేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మూలం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం (AP Deputy CMO)

కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ..

చిత్రం
నర్సంపేట : కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా నర్సంపేట డివిజన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి అడ్డూరి రాజు మాట్లాడుతూ, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజంలోని బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గిరిజన గ్రామాల్లో పర్యటించి, గిరిజనులను ఏకం చేస్తూ భూ పోరాటాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన నిరంతరం డిమాండ్ చేశారని తెలిపారు. కోవిడ్ కాలంలో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఉద్యమానికి తన వంతు బాధ్యతగా పాల్గొన్నారని గుర్తు చేశారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకుడు బానోతు జవహర్‌లాల్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అలువాల నరేష్, ఎం.డి. ఖలీల్, ఎస్.కే. రంజాన్, బాలరాజు, రాజేందర్, రవి తదితరులు పాల్గొన్నారు. మూలం...

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన హసన్‌పర్తి పోలీసులు..

చిత్రం
  హసన్‌పర్తి : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని యజమానులకు అప్పగించడంలో హసన్‌పర్తి పోలీసులు విజయవంతమయ్యారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో, CEIR (Central Equipment Identity Register) పోర్టల్ సహాయంతో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బుధవారం బాధితులకు అందజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వాటి వివరాలను కేంద్ర ప్రభుత్వ CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం ఫోన్ల IMEI నంబర్లను బ్లాక్ చేసి అధునాతన సాంకేతిక నిఘా పరిజ్ఞానం ద్వారా వాటి ఆచూకీ (లొకేషన్) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ బాధితులకు అందజేయగా, తమ పోయిన ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు కాపీ ఆధారంగా సంచార్ సాథి వెబ్‌సైట్‌లోని CEIR సేవ ద్వారా మొబైల్‌ను వెంటనే బ్లాక్ చేయాలన...

హసన్‌పర్తిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై పోలీసుల దాడి.. 7 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం స్వాధీనం

చిత్రం
హసన్‌పర్తి , జూలై 15: హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 క్వింటాళ్ల 50 కిలోల రేషన్ బియ్యం (16 ప్లాస్టిక్ సంచులు)ను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ డి. యాదగిరి, పోలీసు సిబ్బంది పి. ధనుంజయ్య, ఎం. భరత్లతో కలిసి ఎల్లాపూర్ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, దండుగుల రమేష్ ఇంటి సమీపంలోని షెడ్డులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో షెడ్డుపై దాడి చేసి తనిఖీ చేయగా, 16 ప్లాస్టిక్ సంచుల్లో 7 క్వింటాళ్ల 50 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.21 వేలగా పోలీసులు అంచనా వేశారు. విచారణలో నిందితుడు దండుగుల రమేష్ (42), ఎల్లాపూర్ గ్రామంకు చెందినవాడని, చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి కిలోకు రూ.10 చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేసి, కిలో రూ.30కు విక్రయించేందుకు నిల్వ ఉంచినట్లు అంగీక...

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే తెలంగాణ భవిష్యత్‌ను నిర్మించాలి: సీఎం రేవంత్ రెడ్డి

చిత్రం
వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. "పలుగు, పార పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి" అని పేర్కొన్నారు. చదువే జీవితాన్ని మార్చే శక్తి అని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్య ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా కుటుంబాలకు ఆనందాన్ని తీసుకొస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కిట్ల నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా స్వీకరించే విధానాన్ని విద్యాశాఖ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను...

ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం: నైపుణ్యాలే యువత భవిష్యత్తుకు పునాది – సీఎం రేవంత్ రెడ్డి.

చిత్రం
హైదరాబాద్ : కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పాటు శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యువత విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ కాలానుగుణంగా ఎదగాలని సూచించారు. నైపుణ్యాలు వ్యక్తిగత విజయానికే కాకుండా సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు. యువతకు అత్యాధునిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోందని, ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధునిక పరిశ్రమలు, సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. "నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు... నైపుణ్యాలను పెంపొందించుకోండి. మీ వ్యక్తిగత విజయంతో పాటు సమాజ అభివృద్ధిలోనూ ...

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి: కేంద్రాన్ని కోరిన సీఎం

చిత్రం
ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణంపై చర్చించారు. ఈ రెండు విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానాంశాలు : ➡️ ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వరంగల్ కీలక కేంద్రంగా మారుతుందని సీఎం తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ➡️ వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో (విమానాల నిర్వహణ, మరమ్మతులు), ఎయిర్ కార్గో, హ్యాంగర్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించేలా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ➡️ వరంగల్ విమానాశ్రయ డిజైన్‌లో కాకతీయుల చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా రూపకల్పన చేయాలని సీఎం సూచించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ➡️ ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలోని...

పార్లమెంట్ సమావేశాల ముందు ఎంపీలతో సీఎం సమావేశం.. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కార్యాచరణ

చిత్రం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఎంపీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించి, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధుల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధాన అంశాలు : ఐఐఎం హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి మంజూరు కోసం విజ్ఞప్తి చేయాలని ఎంపీలకు సూచించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ: మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఫేజ్-1 స్వాధీనానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయం కోసం బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR): ఉత్తర భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తైందని, దక్షిణ భాగం భూసేకరణతో పాటు ప్రాజెక్టు పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరమని తెలిపారు. మూసీ పునరుజ్...

మైనర్‌పై లైంగిక దాడి.. పోక్సో కేసులో యువకుడు అరెస్ట్

చిత్రం
గీసుగొండ : ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మసాగర్‌కు చెందిన **బొడ్డు బన్నీ (21)**పై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. 2023లో పదో తరగతి చదువుతున్న సమయంలో బాధితురాలికి పరిచయమైన నిందితుడు, ప్రేమిస్తున్నానని నమ్మించి ఓ వెంచర్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం 2024 వరకు పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చగా, గర్భస్రావానికి సంబంధించిన మాత్రను కేకులో కలిపి తినిపించినట్లు, అలాగే తన వద్దకు రాకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతో పాటు ఇటీవల వరంగల్‌లో ఆమెపై దాడి చేసి మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు కూడా తెరుస్తామని ఏసీపీ వెంకటేష్ హె...

ఆసియా U23 అథ్లెటిక్స్‌లో తెలంగాణ కీర్తి పతాకం.. ప్రవల్లిక నరిమళ్లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

చిత్రం
చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణకు చెందిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ అయిన ప్రవల్లిక నరిమళ్ల ఆసియా U23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి మహిళల 4×400 మీటర్ల రిలేలో భారత జట్టుకు స్వర్ణ పతకాన్ని అందించడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందిన ప్రవల్లిక అంతర్జాతీయ వేదికపై రాణించడం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తాపీ మేస్త్రీ కూతురైన ప్రవల్లిక పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారని ప్రశంసించారు. మహిళల 4×400 మీటర్ల రిలేలో ప్రవల్లిక నరిమళ్లతో పాటు శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్ సభ్యులుగా ఉన్న భారత జట్టు 3 నిమిషాల 33.62 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆతిథ్య దేశం చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థాన...

లెజెండరీ గాయని ఎస్. జానకి కన్నుమూత.. సంగీత ప్రపంచంలో విషాదం..

చిత్రం
ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి (88) శనివారం కన్నుమూశారు. వయోభారంతో ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. 1938 ఏప్రిల్ 23న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకి, తన మధుర గానంతో భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తం 17 భాషల్లో 50 వేలకుపైగా పాటలు ఆలపించి కోట్లాది సంగీతాభిమానుల అభిమానాన్ని సంపాదించారు. ఆమె గాన ప్రతిభకు గుర్తింపుగా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు, అనేక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి. దాదాపు ఆరు దశాబ్దాలపాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సినీ సంగీతానికి చిరస్మరణీయమైన సేవలను అందించింది. ఎస్. జానకి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఆమె తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. నవరసాలను ఆవిష్కరిస్తూ ఆమె ఆలపించిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయని తెలిపారు. తెలుగు వారు కావడం తెలుగు ప...

హసన్‌పర్తి పెద్ద చెరువులో వృద్ధురాలి మృతదేహం లభ్యం..

చిత్రం
హసన్‌పర్తి : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, హసన్‌పర్తి గ్రామానికి చెందిన కోడూరి మీనయ్య భార్య రాజమణి (71) గత పదేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో హసన్‌పర్తి పెద్ద చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త మీనయ్య ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స విజయవంతం.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లోనూ తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, ప్రస్తుతం తొలిదశలో కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయకుండా, ముందుగా కుడి భుజానికి చికిత్స అందించారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజాలకు గాయాలు కాగా, అనంతరం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినప్పటికీ ప్రజా కార్యక్రమాలు, సమావేశాలు, పాదయాత్రలు, ఎన్నికల ప్రచారాల్లో నిరంతరం పాల్గొన్నారు. ఈ క్రమంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో తరచూ కరచాలనాలు, ఆప్యాయంగా పలకరింపులు జరగడం వల్ల గాయాలు మరింత తీవ్రతరమైనట్లు వెల్లడైంది. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్‌తో పాటు కండరాల చీలికలు (మసిల్ టియర్స్) కూడా ఉన్నట్లు వైద్యులు...

2036 ఒలింపిక్స్‌కు తెలంగాణ వేదిక కావాలి.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

చిత్రం
గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం.. ఆరుగురు క్రీడాకారులకు రూ.7.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలు.. 2026 ఖేలో ఇండియా సహా పలు అంతర్జాతీయ టోర్నీలకు తెలంగాణ ఆతిథ్యం హైదరాబాద్ : 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ, ఆ క్రీడల నిర్వహణకు తెలంగాణ వేదిక కావాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఆ దిశగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. గచ్చీబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 82 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని నిర్మించి 2028 డిసెంబరులో ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణలో స్పష్టమైన క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నామని, నిజమైన క్రీడాకారులక...

ఓఆర్‌ఆర్ పరిధిని కాలుష్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

చిత్రం
హైదరాబాద్ నగరంలోని బయటి వలయ రహదారి (ఓఆర్‌ఆర్) అంతర్భాగాన్ని పూర్తిగా కాలుష్యరహిత ప్రాంతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. సుమారు 2,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 1.35 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి చేపడతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ఫలకాల తయారీ కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సంస్థ రూపొందించిన సౌరశక్తితో పనిచేసే వీధి దీపం, గాలిని శుద్ధి చేసే ‘ఆక్సీట్రీ’ వ్యవస్థతో పాటు తయారీ విభాగంలోని ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యల నుంచి హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల కాలుష్యం, మూసీ నది కాలుష్యం నగర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. అందుకే ఓఆర్‌ఆర్ పరిధిలోని ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్య...

టీజీపీఎస్సీ నుంచి మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు.. 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం.

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరోసారి శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని రెండు కీలక ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న మొత్తం 29 పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు నియామక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో 10 పోస్టులు, తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో 19 పోస్టులు ఉన్నాయి. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో 10 పోస్టులు 05/G/TP/2026 నోటిఫికేషన్ ప్రకారం మల్టీ జోనల్ కేడర్ పరిధిలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జూలై 10 నుంచి ఆగస్టు 17, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు వేతనం అందనుంది. ఈ పోస్టులకు B.Arch, B.E./B.Tech (సివిల్), B.Planning లేదా B.Tech (Planning)లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అదేవిధంగా M.A./M.Sc (Geography) లేదా M.Sc (Geoinfo...

గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.. చిన్నారుల భద్రతే లక్ష్యమన్న పోలీసులు

చిత్రం
మహబూబాబాద్ : చిన్నారుల భద్రత, బాలలపై లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. షీ టీం, భరోసా సెంటర్, ఏహెచ్‌టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మధ్య తేడాను పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా లేదా అసౌకర్యంగా అనిపించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా షీ టీం, భరోసా సెంటర్ లేదా పోలీసులను సంప్రదించాలని అవగాహన కల్పించ...

మహబూబాబాద్ జిల్లాలో 128.496 కిలోల డ్రై గంజాయి దగ్ధం.

చిత్రం
మహబూబాబాద్: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ (NDPS) చట్టానికి సంబంధించిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.64.24 లక్షల విలువైన 128.496 కిలోల డ్రై గంజాయిని మంగళవారం చట్టప్రకారం పూర్తిగా దగ్ధం చేశారు. 'ఈగల్' (Elite Action Group for Drug Law Enforcement) మార్గదర్శకాల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి, న్యాయస్థానం అనుమతితో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను నిబంధనల ప్రకారం నాశనం చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో ప్రత్యేక యంత్రాల ద్వారా గంజాయిని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా మలుచుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ చట్టం క...

డిజిటల్ గవర్నెన్స్‌తో పరిపాలనలో పారదర్శకత.. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలపై సీఎం కీలక ఆదేశాలు.

చిత్రం
హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనలో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించేందుకు వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, అవసరమైతే చట్టపరమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా డిజిటల్ గవర్నెన్స్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ నుంచే జీతాలు అందేలా ఉద్యోగులు, జీతాలు, బ్యాంకు ఖాతాల వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో రాష్ట్రంలో సుమారు 4,800 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, వాటిలో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభ...

వాహనాన్ని ఢీకొట్టి.. ఆపై బాధితుడి మీద దాడి... నిందితుడి అరెస్ట్.

చిత్రం
గీసుగొండ, జూలై 6 (అద్వైత అక్షరం): రోడ్డు ప్రమాదానికి కారణమై ఆపై బాధితుడి మీద దాడికి పాల్పడిన నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, గీసుగొండ మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన బాల్తా బుచ్చిబాబు గత నెల (మే 21) న రాత్రి 7 గంటల సమయంలో మచ్చాపురం–ఎలుకుర్తి రహదారిపై వస్తుండగా అదే గ్రామానికి చెందిన కంబాల వెంకటేష్ టూవీలర్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బుచ్చిబాబును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదంపై బుచ్చిబాబు వెంకటేష్ ను ప్రశ్నించగా వెంకటేష్ తీవ్ర పదజాలంతో దూషించి దాడికి చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం సమీపంలో ఉన్న రాయితో కాలిపై కొట్టడంతో బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గీసుగొండ పోలీసులు హెచ్చరించార...

స్టేషన్ ఘన్‌పూర్ 17వ వార్డులో 33 కేవీ విద్యుత్ లైన్ తొలగింపు.. స్థానికుల్లో హర్షం

చిత్రం
స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని 17వ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా 33 కేవీ విద్యుత్ లైన్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గాదె ఈశ్వరయ్య నివాసం సమీపంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా కిందికి ఉండటంతో వాహనాలు, పాఠశాల బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను స్థానికులు పలుమార్లు గతంలో ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. అనంతరం ప్రస్తుత కౌన్సిలర్ పొన్నం స్వరూప్ రాజయ్య దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వెంటనే స్పందించి 33 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించేలా చర్యలు చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో స్థానికులు కౌన్సిలర్ పొన్నం స్వరూప్ రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్, పొన్నం నాగరాజు, రంజిత్ కుమార్, నీల పరశురాములు, మామిండ్ల శ్రీను, పండుగ అశోక్, మునిగేల రాజు, రమేష్, మధు, పవన్, శ్రవణ్, వేముల రాము, పిట్టల చంద్రయ్య, ఉరడి శ్రీను, అఖిల్, కుంభం మధు, నితిన్, శగా శి...