ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు.. ఖాళీలన్నీ భర్తీ చేస్తాం.. సిఎం రేవంత్ రెడ్డి...
సంగారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇకపై ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలోని ఏ ఒక్క ఉద్యోగ ఖాళీని కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. 3.42 కోట్ల మందికి సన్నబియ్యం... పేదలు ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. దేశంలో రేషన్ షాపుల వ్యవస్థను ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. సన్నబియ్యం...