పోస్ట్‌లు

తెలంగాణ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గీత, చేనేత కార్మికులకు సంతృప్త స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి

చిత్రం
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సర్వాయి పాపన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని పునరుద్ఘాటించారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. గౌడ సోదరులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. గీత కార్మికుల వృత్తిని పరిరక్షించేందుకు నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపై ఈత, తాటి చెట్లను నాటాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం ఆదేశించారు. పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. సర్దార్ సర్వాయి పాపన్న ఒక కులానికి, కుటుంబానికి పరిమితమైన వ్యక్తి కాదని, బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడని సీఎం పేర్కొన్నారు. పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, కులవృత్తులను గౌరవిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని స...

సనత్‌నగర్‌లో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి...

చిత్రం
హైదరాబాద్: సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి **డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)**ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను మంత్రులతో కలిసి పరిశీలించారు. కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డు, ట్రామా విభాగం, ఐసీయూ తదితర విభాగాలను సీఎం పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు. చికిత్స కోసం వచ్చే రోగుల నమోదు ప్రక్రియ, రిసెప్షన్‌లో ఏర్పాటు చేసిన టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పనితీరు, ఓపీ కౌంటర్ నిర్వహణను కూడా సీఎం పరిశీలించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించిన సీఎం వాటి వినియోగం, పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్...

ములుగు అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి...

చిత్రం
ములుగు: ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని నిధులను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీఓసీ)ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ములుగు ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా వనదేవతలు సమ్మక్క–సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జంపన్నవాగు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం... ములుగు ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యమున్న జంపన్నవాగును నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, అవసరమైన నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంతో పాటు కోర్టు భవనాలను నిర్మించాలన్న మంత్రి సీతక్క సూచనల మేరకు త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. మల్లూరు నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేస్తామని వెల్...

మేడారంలో వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

చిత్రం
ములుగు: వనదేవతలు సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులో భాగంగా సమ్మక్క–సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించిన ముఖ్యమంత్రి అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గిరిజన పూజారులు డోలు వాయిద్యాలు, సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం.. మేడారంలో స్థానికంగా అర్హులైన వితంతు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. భక్తుల కోసం తాగునీటి ప్లాంట్ ప్రారంభం.. మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించా...

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు.. ఖాళీలన్నీ భర్తీ చేస్తాం.. సిఎం రేవంత్ రెడ్డి...

చిత్రం
సంగారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఇకపై ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలోని ఏ ఒక్క ఉద్యోగ ఖాళీని కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. 3.42 కోట్ల మందికి సన్నబియ్యం... పేదలు ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. దేశంలో రేషన్ షాపుల వ్యవస్థను ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. సన్నబియ్యం...

మేడారం ప్రధాన రహదారిపై హరిత కార్యక్రమం.. డివైడర్లలో మట్టి నింపి మొక్కలు నాటిన సర్పంచ్..

చిత్రం
ములుగు, ఆగస్టు 7 (అద్వైతాక్షరం): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక హరిత కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర మంత్రి సీతక్క సూచనల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు మంకిడి నరసింహస్వామి మార్గదర్శకత్వంలో మేడారం ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లలో మట్టి నింపి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడారం సర్పంచ్ పీరీల భారతి–వెంకన్న ఆధ్వర్యంలో ప్రధాన రహదారి డివైడర్లలో మట్టి నింపడంతో పాటు హరిత వే జంక్షన్ సమీపంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరమని, మొక్కలు పెరగడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు సకాలంలో వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. చెట్లను నరుకడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్ గొంది సరిత–నర్సింగరావు, వార్డు సభ్యురాలు అట్టం శైలజ–రమేష్, గ్రామ కార్యదర్శి శరత్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పా...

శనిగాపురం తండాల్లో కార్డెన్ అండ్ సెర్చ్.. 30 లీటర్ల గుడుంబా, 700 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం..

చిత్రం
మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం మైబాద్ రూరల్ సీఐ ఎన్. అంజలి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శనిగాపురం గ్రామ పరిధిలోని పాత తండా, బోడతండాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వం నిషేధించిన గుడుంబాను తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 30 లీటర్ల గుడుంబా, 700 లీటర్ల బెల్లం పానకంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెల్లం పానకాన్ని సంఘటన స్థలంలోనే ధ్వంసం చేశారు. గుడుంబా తయారీలో పాల్గొన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు, ఎస్సై రవికిరణ్, కొరివి ఎస్సై సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల భద్రతకు సీసీ కెమెరాలే రక్షణ కవచం.. మూడు గ్రామాల్లో ఏర్పాటుకు ప్రజల సహకారం...

చిత్రం
హనుమకొండ (దామెర) : ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత కీలకమని దామెర ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు అన్నారు. దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్, తక్కళ్లపాడు, కౌకొండ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, రహదారి ప్రమాదాల దర్యాప్తు వంటి అంశాల్లో పోలీసులకు ఎంతో తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, ఉపసర్పంచ్ ముక్కెర రాజు రూ.50 వేల విలువైన సహాయం అందించారు. తక్కళ్లపాడు సర్పంచ్ వసంత రమేష్ రూ.27 వేల విలువైన సీసీ కెమెరాలను అందజేయగా, వెంకటాపూర్ సర్పంచ్ పంచగిరి రాజు, ఉపసర్పంచ్ గోల్కొండ రమేష్ రూ.25 వేల ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఎస్సై అభినందించారు. ప్రజల భద్రత కోసం ఇతర గ్రామాల ప్...

చిన్నారికి గడువు ముగిసిన సిరప్ ఇచ్చిన ఘటన.. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిపై ఆరోపణలు

--మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు ముగిసిన సిరప్ ఇవ్వడంపై బాలుడి తండ్రి ఆగ్రహం. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారికి గడువు ముగిసిన మందు అందించిన ఘటన కలకలం రేపింది. ఇందిరానగర్ కాలనీకి చెందిన మురళి తన నాలుగేళ్ల కుమారుడు ఎనోస్ రాజ్‌ను వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురికావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు చిన్నారిని పరీక్షించి రెండు రకాల సిరప్‌లు సూచించారు. అందులో ఒక సిరప్‌ను ఆసుపత్రి ఫార్మసీ నుంచి అందించగా, మరో సిరప్‌ను బయట నుంచి కొనుగోలు చేయాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నారికి మందు ఇవ్వడానికి ముందు సిరప్‌పై ఉన్న గడువు తేదీని పరిశీలించగా, అది జూన్ 2026లోనే గడువు ముగిసినట్లు గుర్తించారు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించగా, బాలుడి తండ్రికి సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. "గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా..?" అంటూ బాలుడి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు ముగిసిన మందులు ఎలా నిల్వ ఉంచారనే దానిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చే...

పోలీస్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

చిత్రం
తెలంగాణ : పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియామక ప్రక్రియకు భంగం కలిగించేలా కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థపూరిత వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో, డీజీపీ సీవీ ఆనంద్తో పాటు ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నియామక ప్రక్రియలో నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసి, ఎలాంటి లోపాలు లేదా అవకతవకలకు తావులేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా, పరీక్షల నిర్వహణ తదితర ప్రతి దశలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలపై సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉద్యోగా...

ప్రపంచ తల్లి పాల వారోత్సవాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: మంత్రి సీతక్క

చిత్రం
హైదరాబాద్, ఆగస్టు 1: ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు (ఆగస్టు 1–7) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబానికి చేరవేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. తల్లి పాలు ప్రతి శిశువుకు సహజసిద్ధమైన సంపూర్ణ పోషకాహారమని మంత్రి తెలిపారు. శిశువు పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు తొలి రోగనిరోధక టీకాలా పనిచేస్తాయని పేర్కొన్నారు. జన్మించిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించి, తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే అందించాలని సూచించారు. అనంతరం వయస్సుకు తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగిస్తే పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే ఉద్యమంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. ఇందుకోసం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాలు, పట్టణ వార్డుల్లో అవగాహన సమావేశాలు, ఇంటింటి ప్రచారం, కమ్యూనిటీ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ సిబ్బంది, మహిళా శిశ...

రామన్నగూడెం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క...

చిత్రం
ములుగు : ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేంకన్, ఆర్డీవో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ చిటమట రఘు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్, రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. .

మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: అధికారులకు సీఎం ఆదేశాలు..

చిత్రం
హైదరాబాద్ , జూలై 23: హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ పూర్తికాకముందే టెండర్లు పిలవకూడదని సీఎం స్పష్టం చేశారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. అలాగే మూడు మున్సిపల్ కమిషనరేట్ల పరిధిలో చేపట్టే పనులకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం, జంక్షన్ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులకు సూచించారు. సమావేశంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) భవనం, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన నమూనాలను పరిశీలించ...

తెలంగాణలో జనసేన పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలు.. స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాచరణకు శ్రీకారం..

చిత్రం
తెలంగాణలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ తదితర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ పర్యటనల సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణ, కార్యకర్తలతో క్షేత్రస్థాయి ప్రత్యక్ష సమావేశాలు, స్థానిక ప్రజా సమస్యలపై సమీక్ష, ఎన్నికల సన్నాహక వ్యూహాలపై చర్చలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తొలి విడత సమావేశం నిర్వహించారు. అనంతరం మిగిలిన 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేసిన తర్వాత, జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రత్యేక పర్యటనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు X వేదికగా వెల్లడించాయి. మూలం: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం.

ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం తీసుకురానున్న తెలంగాణ ప్రభుత్వం

చిత్రం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆహార పదార్థాలు, ఔషధాల్లో పెరుగుతున్న కల్తీలను అరికట్టేందుకు **తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)**ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. మార్కెట్‌లో లభిస్తున్న నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాల్లో కల్తీ పెరగడంతో ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలను వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం కారణంగా పంటల్లో రసాయన అవశేషాలు మిగులుతున్నాయని, దీంతో కొన్ని దేశాలు భారత వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను నిరాకరిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. సేంద్రియ ఉత్పత్తుల పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్న వస్తువుల నాణ్యతను నిర్ధారించే సమర్థమైన వ్యవస్థలు ప్రస్తుతం లేవని, ప్రజలు అధిక ధరలు చెల్లిస్తున్నప్పటికీ వాటి ప...

ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

చిత్రం
హైదరాబాద్ : "జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు. అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం తెలిపారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అంకితభావం, ప్రజల పట్ల నిబద్ధత, సమాజానికి అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ పేరు, ఆయన సాహిత్యం, ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూలం: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO Telangana)

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే తెలంగాణ భవిష్యత్‌ను నిర్మించాలి: సీఎం రేవంత్ రెడ్డి

చిత్రం
వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. "పలుగు, పార పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలి" అని పేర్కొన్నారు. చదువే జీవితాన్ని మార్చే శక్తి అని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్య ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా కుటుంబాలకు ఆనందాన్ని తీసుకొస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించిన సీఎం, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కిట్ల నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా స్వీకరించే విధానాన్ని విద్యాశాఖ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను...

ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం: నైపుణ్యాలే యువత భవిష్యత్తుకు పునాది – సీఎం రేవంత్ రెడ్డి.

చిత్రం
హైదరాబాద్ : కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పాటు శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యువత విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సందేశంలో, యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ కాలానుగుణంగా ఎదగాలని సూచించారు. నైపుణ్యాలు వ్యక్తిగత విజయానికే కాకుండా సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు. యువతకు అత్యాధునిక నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోందని, ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధునిక పరిశ్రమలు, సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. "నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు... నైపుణ్యాలను పెంపొందించుకోండి. మీ వ్యక్తిగత విజయంతో పాటు సమాజ అభివృద్ధిలోనూ ...

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి: కేంద్రాన్ని కోరిన సీఎం

చిత్రం
ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణంపై చర్చించారు. ఈ రెండు విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానాంశాలు : ➡️ ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వరంగల్ కీలక కేంద్రంగా మారుతుందని సీఎం తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ➡️ వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో (విమానాల నిర్వహణ, మరమ్మతులు), ఎయిర్ కార్గో, హ్యాంగర్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించేలా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ➡️ వరంగల్ విమానాశ్రయ డిజైన్‌లో కాకతీయుల చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా రూపకల్పన చేయాలని సీఎం సూచించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ➡️ ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలోని...

పార్లమెంట్ సమావేశాల ముందు ఎంపీలతో సీఎం సమావేశం.. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కార్యాచరణ

చిత్రం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ఎంపీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించి, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధుల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రధాన అంశాలు : ఐఐఎం హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి మంజూరు కోసం విజ్ఞప్తి చేయాలని ఎంపీలకు సూచించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ: మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఫేజ్-1 స్వాధీనానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయం కోసం బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR): ఉత్తర భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తైందని, దక్షిణ భాగం భూసేకరణతో పాటు ప్రాజెక్టు పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరమని తెలిపారు. మూసీ పునరుజ్...