ప్రజల భద్రతకు సీసీ కెమెరాలే రక్షణ కవచం.. మూడు గ్రామాల్లో ఏర్పాటుకు ప్రజల సహకారం...

హనుమకొండ (దామెర) : ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత కీలకమని దామెర ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు అన్నారు. దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్, తక్కళ్లపాడు, కౌకొండ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.


ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, రహదారి ప్రమాదాల దర్యాప్తు వంటి అంశాల్లో పోలీసులకు ఎంతో తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, ఉపసర్పంచ్ ముక్కెర రాజు రూ.50 వేల విలువైన సహాయం అందించారు. తక్కళ్లపాడు సర్పంచ్ వసంత రమేష్ రూ.27 వేల విలువైన సీసీ కెమెరాలను అందజేయగా, వెంకటాపూర్ సర్పంచ్ పంచగిరి రాజు, ఉపసర్పంచ్ గోల్కొండ రమేష్ రూ.25 వేల ఆర్థిక సహకారం అందించారు.

ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఎస్సై అభినందించారు. ప్రజల భద్రత కోసం ఇతర గ్రామాల ప్రజాప్రతినిధులు, దాతలు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
WhatsApp Share

కామెంట్‌లు