పోస్ట్‌లు

విద్య లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఏకశిల స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

చిత్రం
హనుమాన్ నగర్: హనుమాన్ నగర్‌లోని ఏకశిల స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు దేశభక్తి గీతాలు, నృత్యాలతో అలరించడంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి  మాట్లాడుతూ.. స్వతంత్ర సమరయోధుల వీరత్వం, దేశభక్తి గురించి విద్యార్థులకు తెలియచేశారు., సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించేలా విద్యార్థుల ప్రదర్శనలు సాగాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

విద్యార్థుల యూనిఫాంలపై వాట్సాప్ ద్వారా ఫీడ్‌బ్యాక్.. నాణ్యత ఆధారంగా వచ్చే ఏడాది మార్పులు: సీఎం

చిత్రం
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫాంల నాణ్యత, సైజు, రంగు తదితర అంశాలపై విద్యార్థుల నుంచి నేరుగా వాట్సాప్ ద్వారా అభిప్రాయాలు (ఫీడ్‌బ్యాక్) సేకరిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాంల పంపిణీ విధానం, రంగులు, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం యూనిఫాంల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు అందించే యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. మహిళా సంఘాల ద్వారా కుట్టు పనులు వేగవంతం అయ్యేలా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్యకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో యూనిఫాంల పంపిణీలో లోపాలు చోటుచేసుకున్నాయని పేర్కొ...

గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.. చిన్నారుల భద్రతే లక్ష్యమన్న పోలీసులు

చిత్రం
మహబూబాబాద్ : చిన్నారుల భద్రత, బాలలపై లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. షీ టీం, భరోసా సెంటర్, ఏహెచ్‌టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మధ్య తేడాను పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా లేదా అసౌకర్యంగా అనిపించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా షీ టీం, భరోసా సెంటర్ లేదా పోలీసులను సంప్రదించాలని అవగాహన కల్పించ...

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు నాంది.. - - ఆరుట్లలో తొలి TPSను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.

చిత్రం
 -- ఆధునిక వసతులతో ప్రభుత్వ విద్యకు కొత్త దిశ – రాష్ట్రవ్యాప్తంగా 100 టీపీఎస్‌ల లక్ష్యం.. హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను సరికొత్త దిశలో నడిపించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్నారు. ఉదయం 9:30 గంటలకు పాఠశాల ప్రాంగణానికి చేరుకునే ముఖ్యమంత్రి, టీపీఎస్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ విద్యా కమిషన్ సూచనల మేరకు ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఈ నమూనా పాఠశాల రూపుదిద్దుకుంది. టీపీఎస్‌లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందించనున్నారు. నాణ్యమైన ...

వేసవి సెలవుల అనంతరం బడి బాట పట్టిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు...

చిత్రం
హైదరాబాద్ : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన సందేశంలో పాఠశాల అనేది కేవలం చదువు నేర్చుకునే స్థలం మాత్రమే కాకుండా వ్యక్తిత్వాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలయం అని పేర్కొన్నారు. ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి తలుపు వంటిదని, ప్రతి పాఠం ఒక కొత్త అవకాశానికి మార్గమని అన్నారు. విద్యార్థులు ప్రతి రోజును ఉత్సాహంగా ప్రారంభించి, గురువుల మార్గదర్శకత్వంలో జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. కష్టపడి చదవడం, మంచి విలువలను అలవర్చుకోవడం ద్వారా తమ కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని, విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి పోషకాహార కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. “నేటి విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాతలు. విద్యే గొప్ప సంపద – దానిని ఎవరూ దోచుకోలేరు” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సోర్స్:  తెలంగాణ ముఖ్యమం...