ఏకశిల స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
హనుమాన్ నగర్: హనుమాన్ నగర్‌లోని ఏకశిల స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు దేశభక్తి గీతాలు, నృత్యాలతో అలరించడంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర సమరయోధుల వీరత్వం, దేశభక్తి గురించి విద్యార్థులకు తెలియచేశారు., సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించేలా విద్యార్థుల ప్రదర్శనలు సాగాయి.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ శైలజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణలో దేశభక్తి వాతావరణం నెలకొంది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి