శనిగాపురం తండాల్లో కార్డెన్ అండ్ సెర్చ్.. 30 లీటర్ల గుడుంబా, 700 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం..
మహబూబాబాద్ : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం మైబాద్ రూరల్ సీఐ ఎన్. అంజలి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
శనిగాపురం గ్రామ పరిధిలోని పాత తండా, బోడతండాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వం నిషేధించిన గుడుంబాను తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 30 లీటర్ల గుడుంబా, 700 లీటర్ల బెల్లం పానకంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం బెల్లం పానకాన్ని సంఘటన స్థలంలోనే ధ్వంసం చేశారు. గుడుంబా తయారీలో పాల్గొన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు, ఎస్సై రవికిరణ్, కొరివి ఎస్సై సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి