తెలంగాణలో జనసేన పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలు.. స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాచరణకు శ్రీకారం..
తెలంగాణలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ తదితర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
ఈ పర్యటనల సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణ, కార్యకర్తలతో క్షేత్రస్థాయి ప్రత్యక్ష సమావేశాలు, స్థానిక ప్రజా సమస్యలపై సమీక్ష, ఎన్నికల సన్నాహక వ్యూహాలపై చర్చలు నిర్వహించనున్నారు.
ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తొలి విడత సమావేశం నిర్వహించారు. అనంతరం మిగిలిన 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేసిన తర్వాత, జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రత్యేక పర్యటనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు X వేదికగా వెల్లడించాయి.
మూలం: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి