రామన్నగూడెం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క...

ములుగు : ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.


ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేంకన్, ఆర్డీవో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ జిల్లా చైర్మన్ చిటమట రఘు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్, రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


.
WhatsApp Share

కామెంట్‌లు