మేడారం ప్రధాన రహదారిపై హరిత కార్యక్రమం.. డివైడర్లలో మట్టి నింపి మొక్కలు నాటిన సర్పంచ్..
ములుగు, ఆగస్టు 7 (అద్వైతాక్షరం): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక హరిత కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర మంత్రి సీతక్క సూచనల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు మంకిడి నరసింహస్వామి మార్గదర్శకత్వంలో మేడారం ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్లలో మట్టి నింపి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మేడారం సర్పంచ్ పీరీల భారతి–వెంకన్న ఆధ్వర్యంలో ప్రధాన రహదారి డివైడర్లలో మట్టి నింపడంతో పాటు హరిత వే జంక్షన్ సమీపంలో మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరమని, మొక్కలు పెరగడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు సకాలంలో వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. చెట్లను నరుకడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్ గొంది సరిత–నర్సింగరావు, వార్డు సభ్యురాలు అట్టం శైలజ–రమేష్, గ్రామ కార్యదర్శి శరత్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి