తెలంగాణ పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న సుమారు 5,000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియను త్వరలో Telangana Police Recruitment Board చేపట్టనుంది.
కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు వివిధ పోలీసు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
పోస్టుల వారీ ఖాళీలు :
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ (ఆర్మ్డ్ రిజర్వ్): 1,052 పోస్టులు
సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 148 పోస్టులు
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్మ్డ్ రిజర్వ్): 14 పోస్టులు
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP): 12 పోస్టులు
ఇతర విభాగాల పోస్టులు: 77
మొత్తం ఖాళీలు: 5,000
అర్హతలు (అధికారిక నోటిఫికేషన్ ప్రకారం తుది వివరాలు)
కానిస్టేబుల్: ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత.
సబ్ ఇన్‌స్పెక్టర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ.
ఎంపిక విధానం :
ప్రిలిమినరీ రాత పరీక్ష
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
తుది రాత పరీక్ష (వర్తించే పోస్టులకు)
సర్టిఫికెట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష
పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (PET), శారీరక కొలతల పరీక్ష (PMT) కోసం ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.
గమనిక: ప్రస్తుతం ప్రభుత్వం నియామకాలకు ఆమోదం తెలిపింది. దరఖాస్తుల ప్రారంభ తేదీ, పోస్టుల వారీ ఖాళీలు ఇంకా అధికారికంగా వెల్లడించనున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి