మైనర్‌పై లైంగిక దాడి.. పోక్సో కేసులో యువకుడు అరెస్ట్
గీసుగొండ: ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మసాగర్‌కు చెందిన **బొడ్డు బన్నీ (21)**పై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. 2023లో పదో తరగతి చదువుతున్న సమయంలో బాధితురాలికి పరిచయమైన నిందితుడు, ప్రేమిస్తున్నానని నమ్మించి ఓ వెంచర్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం 2024 వరకు పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చగా, గర్భస్రావానికి సంబంధించిన మాత్రను కేకులో కలిపి తినిపించినట్లు, అలాగే తన వద్దకు రాకపోతే చంపేస్తానంటూ బెదిరించడంతో పాటు ఇటీవల వరంగల్‌లో ఆమెపై దాడి చేసి మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు కూడా తెరుస్తామని ఏసీపీ వెంకటేష్ హెచ్చరించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి