డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్..

హైదరాబాద్ : కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని డిశ్చార్జ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం పరామర్శించారు.


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గవర్నర్, వైద్యుల సూచనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గవర్నర్ప పవన్ కళ్యాణ్ నివాసంలోని వ్యక్తిగత లైబ్రరీని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సందర్శించి, అక్కడ ఉన్న పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రముఖ రచయితలు, మేధావులు, విశ్లేషకులు, ప్రజా విధాన రూపకర్తలు రచించిన గ్రంథాలపై పవన్ కళ్యాణ్‌తో ఆసక్తికరంగా చర్చించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు ఒక పుస్తకంపై గవర్నర్ ఆటోగ్రాఫ్ చేశారు.

తన ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఆప్యాయంగా విచ్చేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

మూలం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం (AP Deputy CMO)
WhatsApp Share

కామెంట్‌లు