వాహనాన్ని ఢీకొట్టి.. ఆపై బాధితుడి మీద దాడి... నిందితుడి అరెస్ట్.
గీసుగొండ, జూలై 6 (అద్వైత అక్షరం): రోడ్డు ప్రమాదానికి కారణమై ఆపై బాధితుడి మీద దాడికి పాల్పడిన నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, గీసుగొండ మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన బాల్తా బుచ్చిబాబు గత నెల (మే 21) న రాత్రి 7 గంటల సమయంలో మచ్చాపురం–ఎలుకుర్తి రహదారిపై వస్తుండగా అదే గ్రామానికి చెందిన కంబాల వెంకటేష్ టూవీలర్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బుచ్చిబాబును ఢీకొట్టినట్లు తెలిపారు.
ప్రమాదంపై బుచ్చిబాబు వెంకటేష్ ను ప్రశ్నించగా వెంకటేష్ తీవ్ర పదజాలంతో దూషించి దాడికి చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం సమీపంలో ఉన్న రాయితో కాలిపై కొట్టడంతో బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు తెలిపారు.
చట్టాన్ని అతిక్రమించి ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గీసుగొండ పోలీసులు హెచ్చరించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి