తొలి ఏకాదశి సందర్భంగా హనుమాన్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు...

హనుమకొండ : హనుమాన్ నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేసి, పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేదమంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులతో గుడి ప్రాంగణం కిటకిటలాడింది.
హనుమాన్ నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారు.

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆలయ అర్చకులు దీవించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథులన్నింటికీ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశిగా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యంగా పిలుస్తారనీ ఆలయ పూజారి తెలియజేశారు.

ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

WhatsApp Share

కామెంట్‌లు