స్టేషన్ ఘన్‌పూర్ 17వ వార్డులో 33 కేవీ విద్యుత్ లైన్ తొలగింపు.. స్థానికుల్లో హర్షం

స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని 17వ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా 33 కేవీ విద్యుత్ లైన్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గాదె ఈశ్వరయ్య నివాసం సమీపంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా కిందికి ఉండటంతో వాహనాలు, పాఠశాల బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సమస్యను స్థానికులు పలుమార్లు గతంలో ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. అనంతరం ప్రస్తుత కౌన్సిలర్ పొన్నం స్వరూప్ రాజయ్య దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వెంటనే స్పందించి 33 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించేలా చర్యలు చేపట్టారు.

ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో స్థానికులు కౌన్సిలర్ పొన్నం స్వరూప్ రాజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్, పొన్నం నాగరాజు, రంజిత్ కుమార్, నీల పరశురాములు, మామిండ్ల శ్రీను, పండుగ అశోక్, మునిగేల రాజు, రమేష్, మధు, పవన్, శ్రవణ్, వేముల రాము, పిట్టల చంద్రయ్య, ఉరడి శ్రీను, అఖిల్, కుంభం మధు, నితిన్, శగా శివ, చెవినబోయిన అనిల్, శగా రాజు, శంకర్, మహేష్, పిట్టల హరీష్, పొన్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Share

కామెంట్‌లు