అత్తిలిలో లేస్, నేత కళాకారులకు ఉచిత కంటి వైద్య శిబిరం...


అత్తిలి: హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాల నిర్వహణను కొనసాగిస్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో లేస్, నేత కళాకారుల కోసం గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.

శిబిరంలో మొత్తం 143 మంది కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. వీరికి త్వరలోనే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరో 110 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించి వాటిని ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా 18 మంది కళాకారులకు అవసరమైన మందులను కూడా పంపిణీ చేశారు.

హస్తకళాకారుల ఆరోగ్యమే వారి జీవనోపాధికి, కళల పరిరక్షణకు కీలకమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కొండపల్లి, నరసాపురం, పాలకొల్లు, బొబ్బిలి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించినట్లు వెల్లడించారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన మందులు, కళ్లద్దాలు, శస్త్రచికిత్సలను ఉచితంగా అందిస్తూ హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
WhatsApp Share

కామెంట్‌లు