CEIR పోర్టల్‌తో పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అప్పగించిన హసన్‌పర్తి పోలీసులు..
హనుమకొండ, జూలై 23: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు తిరిగి అందజేయడంలో హసన్‌పర్తి పోలీసులు మరోసారి విజయవంతమయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ ఆధ్వర్యంలో, స్టేషన్ సిబ్బంది కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ను వినియోగించి పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి గురువారం బాధితులకు అందజేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, బాధితులు మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సంబంధిత వివరాలను CEIR పోర్టల్‌లో నమోదు చేశారు. అనంతరం ఫోన్ల IMEI నంబర్ల ఆధారంగా సాంకేతిక నిఘా చేపట్టి, వాటి ఆచూకీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఇన్‌స్పెక్టర్ ఎ. మహేందర్ బాధితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారి వివరాలను ధృవీకరించిన అనంతరం అధికారికంగా అప్పగించారు.
ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయిస్తే ఫోన్‌ను గుర్తించే అవకాశాలు మెరుగుపడతాయని పోలీసులు సూచించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి