బంగారు బ్రేస్‌లెట్ పోగొట్టుకున్న వ్యక్తి...
హనుమకొండ, జూలై 27 కాజీపేట పోలీసులు మరోసారి తమ అప్రమత్తతను చాటుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోగొట్టుకున్న బంగారు బ్రేస్‌లెట్‌ను గుర్తించి, దాని యజమానికి సురక్షితంగా అప్పగించారు.
డీజిల్ కాలనీకి చెందిన నరేష్ నగరంలోని ఓ షోరూమ్‌లో కొనుగోళ్లు చేస్తున్న క్రమంలో అనుకోకుండా తన బంగారు బ్రేస్‌లెట్‌ను పోగొట్టుకున్నాడు. అనంతరం ఆయన కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ శ్యామ్ సుందర్ వెంటనే స్పందించి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు.
సీఐ ఆదేశాల మేరకు క్రైమ్ పోలీసు సిబ్బంది వి. క్రాంతి కుమార్, కుమార్ షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి, పోయిన బ్రేస్‌లెట్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని నరేష్‌కు అప్పగించారు.
తమ విలువైన బంగారు ఆభరణాన్ని తిరిగి అందించిన కాజీపేట పోలీసుల వేగవంతమైన చర్యలను నరేష్, ఆయన కుటుంబ సభ్యులు అభినందించారు. సీఐ శ్యామ్ సుందర్‌తో పాటు కేసు విచారణలో పాల్గొన్న పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ఆస్తుల రక్షణ, ఫిర్యాదుల పరిష్కారంలో కాజీపేట పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ఇది చదవండి.. అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగల స్వాధీనం..
https://www.advaithaaksharam.in/2026/07/blog-post_27.html
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి