నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు..

వైద్య విద్యలో ప్రవేశానికి కీలకమైన నీట్ (NEET) పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ సి.ఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ ముఖ్యమైన పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీట్ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతోకాలంగా కృషి చేశారని పేర్కొన్నారు. తమ శ్రమ, పట్టుదలపై నమ్మకం ఉంచి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నేపథ్యంలో తెలంగాణలో సుమారు 208 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 2.95 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షా నిబంధనలను పాటిస్తూ ప్రశాంతమైన మనసుతో పరీక్ష రాయాలని సూచించారు. పరీక్షలో విజయం సాధించి తమ లక్ష్యాలను చేరుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.


మూలం: ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకటన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మూసీ నది తీర అభివృద్ధి, భారత్ భవిష్యత్ నగర నిర్మాణం పూర్తి చేసి తీరుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అభిమాని కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. హన్మకొండలోని అభిమాని ఇంటిలో పరామర్శ...

వేసవి సెలవుల అనంతరం బడి బాట పట్టిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు...