ఎస్టీ రిజర్వేషన్ల స్వర్ణోత్సవ వేడుకలకు ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రతినిధి బృందం

తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకల నేపథ్యంలో చేపట్టనున్న ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రకు సంబంధించిన వివరాలను ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి వివరించింది.

ఈ సందర్భంగా ఎస్టీలకు రిజర్వేషన్లు అమలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపడుతున్న బస్సు యాత్ర లక్ష్యాలు, కార్యక్రమాల ఉద్దేశాలను నేతలు సీఎంకు వివరించారు.

ఈ సమావేశంలో లోక్‌సభ సభ్యుడు బలరామ్ నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు.


WhatsApp Share

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మూసీ నది తీర అభివృద్ధి, భారత్ భవిష్యత్ నగర నిర్మాణం పూర్తి చేసి తీరుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అభిమాని కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. హన్మకొండలోని అభిమాని ఇంటిలో పరామర్శ...

వేసవి సెలవుల అనంతరం బడి బాట పట్టిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు...