మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థుల ప్రతిజ్ఞ – ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం
హైదరాబాద్: మాదకద్రవ్యాల మహమ్మారిని నియంత్రించి సమాజాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా విద్యార్థినీ విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్‌పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వాములమవుతామని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తామని, తమతో పాటు ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అలాగే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని విద్యార్థులు సంకల్పం వ్యక్తం చేశారు.
మూలం: సమాచార శాఖ / ప్రభుత్వ ప్రకటన


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి