వ్యవసాయంలో సమగ్ర ప్రణాళిక అమలు చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి.

వ్యవసాయ రంగంలో విత్తనాల సరఫరా నుంచి పండించిన పంటల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పంట వేసినప్పటి నుంచే వారి వివరాలు, పంటల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశపై వ్యవసాయ శాఖకు పూర్తి సమాచారం ఉండాలని స్పష్టం చేశారు.

వర్షాకాలం, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన చర్యలపై సమీక్ష సమావేశంలో రైతు కమిషన్‌, వ్యవసాయ నిపుణులు, విశ్వవిద్యాలయాల సూచనలను చర్చించారు. రైతులు ఇబ్బంది పడకుండా వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా నిర్వహించేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీ పంటల నమోదు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై దృష్టి పెట్టనుంది.

సన్న వడ్లు సాగు చేసే రైతులకు బోనస్ అందిస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. రైతు వేదికలను రైతులకు సేవల కేంద్రాలుగా అభివృద్ధి చేసి అక్కడే విత్తనాలు, ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అలాగే ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యాప్ ద్వారా బుకింగ్ వ్యవస్థ తీసుకురావాలని, రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని ఆదేశించారు.

వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై కూడా దృష్టి సారిస్తూ, దుమ్ముగూడెం ప్రాంతంలో అమలవుతున్న పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను అధ్యయనం చేయాలని సూచిం


చారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వేసవి సెలవుల అనంతరం బడి బాట పట్టిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు...

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు నాంది.. - - ఆరుట్లలో తొలి TPSను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.