రోడ్డు భద్రతే లక్ష్యం – మొండ్రాయి మార్గంలో మరో 5 హెచ్చరిక బోర్డుల ఏర్పాటు...


ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సంగెం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్‌ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో మొండ్రాయి మార్గంలో మరో 5 రోడ్డు భద్రత హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఇదే మార్గంలో 20 రోడ్డు భద్రత బోర్డులు ఏర్పాటు చేయగా, వాహనదారుల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో 3డీ పోలీస్ ఇన్నోవా వాహనం నమూనాను కూడా ఏర్పాటు చేశారు. తాజా బోర్డులతో కలిపి సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 రోడ్డు భద్రత హెచ్చరిక బోర్డులు అందుబాటులోకి వచ్చాయి.

ఈ హెచ్చరిక బోర్డుల ద్వారా అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర అలవాట్లపై అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల పాటనకు ప్రోత్సాహం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని, అతివేగాన్ని నివారిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

WhatsApp Share

కామెంట్‌లు