అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మొండ్రాయి గ్రామసభ నిర్వహణ..

 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మొండ్రాయ్ గ్రామంలో గ్రామసభనిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్‌ఐ వంశీకృష్ణ, గ్రామ ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు, కుటుంబ వ్యవస్థ మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తూ, వాటి వినియోగం, విక్రయం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

“డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యవంతమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి అందరం కలిసి కృషి చేద్దాం” అనే సందేశంతో గ్రామస్థులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారంతో నిరంతరం చర్యలు కొనసాగిస్తామని సంగెం పోలీసులు తెలిపారు.

WhatsApp Share

కామెంట్‌లు