తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై చేరికల కమిటీ సమావేశం..
తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నేడు జనసేన పార్టీ చేరికల కమిటీ సమావేశం నిర్వహించారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర బాధ్యులు నేమూరి శంకర్ గౌడ్, సీనియర్ నాయకుడు రాజలింగం పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే నాయకత్వాన్ని గుర్తించడం, భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో చేరికల కమిటీ సభ్యులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ గడల శ్రీనివాసరావు, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, ముదురు సరస్వతి పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి