మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తాయని, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలకు దారితీస్తాయని పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టడంలో అవగాహన, అప్రమత్తత, సామాజిక బాధ్యత కీలకమని తెలిపారు. యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
‘డ్రగ్ ఫ్రీ తెలంగాణ’ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి