రెండు చుక్కలు.. జీవితాంతం రక్షణ..


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా (28/06/2026-30/06/2026) వరకు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి ఈరోజే తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

పల్స్ పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని, వారి ఆరోగ్యవంతమైన జీవితానికి మరియు బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతాయని పేర్కొన్నారు.

ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం.. పోలియో రహిత భారతదేశం కోసం.. ప్రతి చిన్నారికి నేడు పోలియో చుక్కలు వేయించండి.

WhatsApp Share

కామెంట్‌లు