ఖానాపూర్‌లో 2 కిలోలకు పైగా గంజాయి పట్టివేత..


ఖానాపూర్, జూలై 2: ఖానాపూర్ మండలంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో గంజాయి లభ్యం...

పోలీసుల కథనం ప్రకారం, జూలై 1న మధ్యాహ్నం అశోక్‌నగర్ గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నిందితుడి వద్ద నుంచి 2.038 కిలోల ఎండు గంజాయి, ఒక మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,01,900 ఉంటుందని పోలీసులు తెలిపారు.

అరెస్టైన వ్యక్తిని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండి గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టలభూపతి తండాకు చెందిన మాలోత్ కళ్యాణ్ (23)గా పోలీసులు గుర్తించారు. అతడిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చట్టపరమైన ప్రక్రియ అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించగా, మహబూబాబాద్ సబ్-జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
WhatsApp Share

కామెంట్‌లు