ఘనపూర్‌లో బీరప్ప దేవాలయ నిర్మాణానికి భూమి పూజ..


ఘనపూర్, జూలై 2 (అద్వైత అక్షరం): ఘనపూర్ పట్టణంలో బీరప్ప దేవాలయ నిర్మాణానికి గురువారం వైభవంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ వినయ్, వైస్ చైర్మన్ రాజమ్మ గట్టయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పొన్న రవి, తొకల అనూష రాజు, పొన్నం రాజయ్యతో పాటు కురుమ సంఘం కమిటీ సభ్యులు కమల కృష్ణ, అము రాజ్, గుంటి రాజయ్య, రాజయ్య మరియు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీరప్ప దేవాలయ నిర్మాణం పూర్తయితే భక్తులకు ఆధ్యాత్మిక సేవలు మరింత విస్తరించడంతో పాటు ఘనపూర్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలోపేతం అవుతుందని కౌన్సిలర్ పొన్న రవి  అభిప్రాయ పడ్డారు.

WhatsApp Share

కామెంట్‌లు