పాలకుర్తిలో 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత...


జనగామ: అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పాలకుర్తి పోలీసులు పట్టుకున్నారు. గురువారం తెల్లవారుజామున నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు వాహనాలను తనిఖీ చేయగా భారీగా పీడీఎస్ బియ్యం బయటపడింది.

ఒక వాహనంలో సుమారు 30 క్వింటాళ్లు, మరో వాహనంలో సుమారు 10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనాలను స్వాధీనం చేసుకుని డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో గ్రామస్థుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నట్లు డ్రైవర్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై పాలకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...