వృద్ధాశ్రమంలో రాఖీ పండుగ.. అన్నదానం చేసిన ఎస్‌ఐ..


హన్మకొండ, ఆగస్టు 28: రాఖీ పండుగ సందర్భంగా హన్మకొండ సబ్‌-ఇన్‌స్పెక్టర్ కె. సతీష్ స్వయంకృషి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి పండుగను జరుపుకోవడంతో పాటు అన్నదానం నిర్వహించారు.

వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించిన ఎస్‌ఐ సతీష్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు వారితో ఆప్యాయంగా మాట్లాడి, వారి అవసరాలు, సమస్యలపై ఆరా తీశారు.


ఈ సందర్భంగా ఎస్‌ఐ సతీష్ మాట్లాడుతూ... వయోవృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వృద్ధులకు ప్రేమ, ఆప్యాయత, గౌరవం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమకు సాధ్యమైన మేరకు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాఖీ పండుగ రోజున తమతో కలిసి సమయం గడిపి, అన్నదానం నిర్వహించిన సతీష్‌కు వృద్ధాశ్రమం నిర్వాహకులు, నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...