తీజ్ వేడుకల్లో మంత్రి సీతక్క సందడి..


బంజారా సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.


గోవిందరావుపేట: పస్రా గ్రామంలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. బంజారా సంప్రదాయాల నడుమ జరిగిన వేడుకల్లో మహిళలతో కలిసి పండుగలో భాగస్వామ్యమై వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సర్పంచ్ బూక్యా సుమలత నివాసంలో జరిగిన కార్యక్రమంలో సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. బంజారా సమాజానికి సేవాలాల్ మహారాజ్ అందించిన స్ఫూర్తి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.

తీజ్ పండుగ కేవలం ఆచారాలకు పరిమితం కాకుండా బంజారా జీవన విధానం, సంస్కృతి, కుటుంబ అనుబంధాలకు ప్రతిబింబమని సీతక్క పేర్కొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పాటలు, నృత్యాలతో వేడుకలు జరుపుకోవడం బంజారా సంస్కృతిలోని ప్రత్యేకతను చాటుతుందని అన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి సాధిస్తూనే తమ మూలాలను, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. తీజ్ వంటి పండుగలు సమాజంలో ఐక్యతను పెంచడంతో పాటు భావితరాలకు సంస్కృతిని పరిచయం చేస్తాయని తెలిపారు.

బంజారా సమాజ సంక్షేమం, విద్య, ఉపాధి, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, పాలడుగు వెంకటకృష్ణ, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, రసపుత్ సీతారామ్ నాయక్ తదితరులతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...