శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 800 గ్రాముల బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. తనిఖీల్లో సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారులకు అందిన సమాచారంతో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించగా ఈ బంగారం గుర్తించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? దీనికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బంగారం తరలింపు వెనుక ఉన్న వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.