ఉపఎన్నికల ఫలితాలు ప్రజల ఆకాంక్షలకు మరింత బలాన్నిచ్చాయి: ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, అక్టోబర్ 9 : ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షం సాధించిన విజయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఫలితాలు బీజేపీ–ఎన్‌డీఏ కూటమి సుపరిపాలన విధానాలపై ప్రజలకు ఉన్న అనుబంధాన్ని మరోసారి ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.

అస్సాంలోని నగావ్ లోక్‌సభ స్థానం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా ఓటర్లకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విజయం కోసం కృషి చేసిన అభ్యర్థులతో పాటు పార్టీ కార్యకర్తలను అభినందించారు.

పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానంలో విజయం సాధించిన ఎన్‌డీఏ మిత్రపక్షం ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్‌ (AINRC)కు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, మెరుగైన భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేసేందుకు ఈ ప్రజాతీర్పు అదనపు శక్తిని, బాధ్యతను ఇచ్చిందని మోదీ తన ఎక్స్‌ (X) పోస్టులో పేర్కొన్నారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...