తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ..
హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్ర పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో డిజిటల్ మీడియాకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటనల విధానానికి ప్రత్యేక మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.