'మానవత్వానికే హీరో’.. భారత పైలట్‌ స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి లేఖ'

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యసాహసాలను ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ప్రశంసించారు. ఆయనను ‘ఇజ్రాయెల్, భారత్‌తో పాటు మొత్తం మానవాళికి హీరో’గా అభివర్ణించారు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత జెరూసలేంకు ఆహ్వానించి, ఇజ్రాయెల్ అత్యున్నత పౌర సాహస పురస్కారాన్ని అందజేస్తానని ప్రకటించారు.

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న దాడి ఘటనలో స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఆయన చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి విమానంలోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తప్పించడంలో కీలకంగా నిలిచాయని హెర్జాగ్ పేర్కొన్నారు.

లేఖలో స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు.. ఆయన తెగువను ప్రశంసించారు. కోలుకున్న అనంతరం స్వయంగా పురస్కారం అందజేస్తానని తెలిపారు. ఈ ఘటన భారత్‌, ఇజ్రాయెల్ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...