బాపూఘాట్‌లో గాంధీజీకి గవర్నర్, సీఎం నివాళులు

హైదరాబాద్, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం, గవర్నర్‌తో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బాపూఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 

మూసీ, ఈసీ నదుల సంగమ ప్రాంతంలో బాపూఘాట్‌లో మహాత్మా గాంధీ స్మారకం ఉంది. 1948లో గాంధీజీ అస్థికలను ఇక్కడ నిమజ్జనం చేశారు. 

1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించిన మహాత్మా గాంధీ.. స్వాతంత్ర్య ఉద్యమంలో అహింస, సత్యాగ్రహ మార్గాల ద్వారా కీలక పాత్ర పోషించారు. 1948 జనవరి 30న ఢిల్లీలో ఆయన హత్యకు గురయ్యారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...