హైదరాబాద్ DRDOలో 18 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు..


హైదరాబాద్: హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (DMRL)లో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి DRDO నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు :

నోటిఫికేషన్ ప్రకారం మెటలర్జికల్ ఇంజినీరింగ్/మెటీరియల్స్ సైన్స్ విభాగంలో 7, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 7, కెమికల్ ఇంజినీరింగ్‌లో 2, ఫిజిక్స్‌లో 2 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు విధానం :

మెటలర్జికల్ ఇంజినీరింగ్/మెటీరియల్స్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధిత ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ BE/B.Techతో పాటు చెల్లుబాటు అయ్యే GATE స్కోర్ ఉన్నవారు అర్హులు. సంబంధిత విభాగంలో ME/M.Tech చేసిన అభ్యర్థులు కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫిజిక్స్ పోస్టులకు ఫిజిక్స్‌లో ఫస్ట్ డివిజన్‌తో M.Sc పూర్తి చేసి, చెల్లుబాటు అయ్యే NET అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి :

అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం SC, ST, OBC తదితర రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తుకు చివరి తేదీ :

JRF పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2026 అక్టోబర్ 6న ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 27, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి, ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

ముఖ్య గమనిక: ఈ పోస్టులకు విభాగాల వారీగా విద్యార్హతలు, GATE/NET అర్హత, వయోపరిమితి తదితర నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు చేసుకునే ముందు DRDO–DMRL అధికారిక నోటిఫికేషన్‌లోని పూర్తి నిబంధనలను పరిశీలించడం మంచిది.

మూలం: DRDO – DMRL అధికారిక నోటిఫికేషన్
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు

స్టార్‌లింక్‌ వివాదంపై కేంద్రం స్పందన.. ‘గుత్తాధిపత్యానికి భారత్‌లో చోటు లేదు’...