మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం..


అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్వతగిరి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో నేడు కల్లెడలోని ఆర్‌డీఎఫ్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఆటల పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ఎస్ఐ ప్రవీణ్ అవగాహన కల్పించారు.

అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

ఢిల్లీలో నిరసనకారులపై చర్యలు దుర్మార్గం: మాస్ లైన్ నాయకులు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు