స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త సమన్వయ కమిటీలు...
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సమన్వయం, పర్యవేక్షణకు త్వరలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
గతంలో నియమించిన సమన్వయకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీలు, వాటికి అనుబంధంగా ఉన్న సపోర్ట్ టీమ్లు ఇకపై కొనసాగవని పేర్కొంది. అలాగే 25 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీలను కూడా రద్దు చేసినట్లు వెల్లడించింది.
ఇటీవల రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ, ప్రచార కమిటీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది.
