జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై హైపవర్ కమిటీ పునరుద్ధరణ...


అమరావతి: జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది.

కమిటీకి హోం మంత్రి చైర్మన్‌గా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖలోని సంబంధిత అధికారులు, ఐజీపీ (లా అండ్ ఆర్డర్), సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

అలాగే గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రముఖ దినపత్రికలు, పీరియాడికల్స్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు, చిన్న, మధ్య తరహా దినపత్రికల సంఘం ప్రతినిధి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ప్రతినిధి, ఫొటోగ్రాఫర్ల సంఘం ప్రతినిధులకు కూడా కమిటీలో చోటు కల్పించారు.

సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. అవసరాన్ని బట్టి మరో సభ్యుడిని కో-ఆప్ట్ చేసే అధికారం కూడా డైరెక్టర్‌కు కల్పించారు.

జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన కేసులను కమిటీ పరిశీలించి, సంబంధిత అంశాలపై తదుపరి చర్యలకు దోహదపడే విధంగా వ్యవహరించనుంది.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

ఢిల్లీలో నిరసనకారులపై చర్యలు దుర్మార్గం: మాస్ లైన్ నాయకులు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు