తెలంగాణలో పాఠశాలలకు 13 రోజుల దసరా సెలవులు...

హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలలకు దసరా పండుగ సందర్భంగా 13 రోజుల సెలవులు రానున్నాయి. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు దసరా సెలవులు కొనసాగనున్నాయి. అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 పరీక్షలు అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఆ పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. 9వ తేదీన 9వ తరగతి ఇంగ్లిష్ పరీక్ష సమయాన్ని కూడా విద్యాశాఖ సవరించింది. ఆ పరీక్ష ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరగనుంది.

జూనియర్ కాలేజీలకు వేర్వేరు తేదీలు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే జూనియర్ కాలేజీలు అక్టోబర్ 21 వరకు సెలవులు ఇవ్వనుండగా, అక్టోబర్ 22న తరగతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు అక్టోబర్ 3 నుంచి 9వ తేదీ వరకు అర్ధవార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.

దసరా సెలవులతో విద్యార్థులు పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునే అవకాశం లభించనుంది.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

ఢిల్లీలో నిరసనకారులపై చర్యలు దుర్మార్గం: మాస్ లైన్ నాయకులు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు