శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు

-- దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రాజెక్టుగా శ్రీశైలం జలాశయం

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం జలాశయం అరుదైన ఘనతను సాధించింది. లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ ప్రాజెక్టుకు చోటు లభించింది. ఇంజినీరింగ్‌ నిర్మాణ ప్రత్యేకతలు, జలవిద్యుత్‌ ఉత్పత్తిలో ప్రాజెక్టు పాత్రను గుర్తిస్తూ ఈ గౌరవం కల్పించారు.

సున్నిపెంట సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ, ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు.

కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలతో పాటు విద్యుత్‌ ఉత్పత్తిలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
WhatsApp Share

మరిన్ని వార్తలు...

గుండ్లసింగారం చైతన్య కాలనీలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ వేడుకలు

ఢిల్లీలో నిరసనకారులపై చర్యలు దుర్మార్గం: మాస్ లైన్ నాయకులు

వివాహిత కుమార్తెకు తండ్రి భూమిపై వారసత్వ హక్కు